Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు
యాదగిరి శేఖర్‌రావు
- మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రయివేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సాయం అందించాల ని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్, టీచింగ్ సిబ్బందికి వెంటనే ప్రభుత్వ సాయం మంజూరు చేయాలని కో రుతూ శుక్రవారం ట్రస్మా ప్రతినిధులు శ్రీనగర్కాల నీలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రయివేటు పాఠశాలలు మూసి ఉండటంతో ఆర్ధికం గా ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యాన్ని 1.25 లక్షల మంది సిబ్బందికి అందజేస్తున్నారని తెలిపారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, విద్యాశాఖ మ ంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌రావులతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల విద్యా శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రయివేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఇంకా సుమారు లక్ష వరకు భోధన, భోధనేతర సిబ్బ ందికి ప్రభుత్వ సాయం అందడం లేదనీ, వారికి కూ డా మంజూరు చేయాలని కోరారు. దీంతో స్పందిం చిన మంత్రి ఈ విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళామనీ, ఎవరూ ఆందోళన చెందవద్దనీ, త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అందరికీ సాయం అందే వరకు రాష్ట్ర సంఘం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భీరప్ప, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, కరీంన గర్ పట్టణాధ్యక్షులు శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.