Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
జగద్గిరిగుట్టలో పర్యటన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఖాళీ ప్రదేశాల్లో చెత్తా చెదారం వేయకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అన్నారు. శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ హెచ్ఎంటీ పైపులైన్ రోడ్డులో గల చెత్త డంపింగ్ యార్డును స్థానిక కార్పొరేటర్ కొలకుల జగన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ మాట్లా డుతూ డంపింగ్ యార్డు చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిష నర్ మమత, గాజుల రామారం సర్కిల్ డీసీ రవీందర్ కుమార్, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరిరావు, టీఆర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్, నాయకులు పాపయ్యగౌడ్, వేణు, రుద్ర అశోక్, మల్లారెడ్డి, పాపిరెడ్డి, బాలరాజు, హజ్రత్‌అలీ, దాసు, బ్రహ్మచారి, మహేందర్, ఇందిరా గౌడ్, సువర్ణ, మురళీ, గణేష్, యాదగిరి, సతీష్, తదితరులు పాల్గొన్నారు. a