Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
గత సంవత్సరం మార్చ్ నెల నుంచి మానవ సమాజంపై దాడి చేసిన కరోనా వైరస్ కళా రంగంలో సంక్షోభం సష్టించింది. మరే రాష్ట్ర ంలో లేనన్ని సాంస్కతిక సంస్థలు తెలుగు రాష్ట్రా లలో.. ప్రత్యేకించి జంటనగరాల్లోనే ఉన్నాయ నేది వాస్తవం. దేశంలోనే ప్రతిష్టాత్మక రవీంద్రభా రతి, రాష్ట్రంలో ఒకే ప్రాంగణంలో నాలుగు వేదిక లుగా ఖ్యాతి చెందిన శ్రీత్యాగరాయ గానసభ, సుందరయ్య విజ్ఞాన కేంద్రంతో పాటు అనుబ ంధంగా సమావేశాలు జరుపుకునేందుకు అను వుగా మరో రెండు వేదికలు, తెలుగు విశ్వవిద్యాల యంలోని ఎన్న్టీఆర్ ఆడిటోరియం, సారస్వత పరిషత్, వేదికలతో పాటు శిల్పకళావేదిక, కళా తోరణం వంటి తదితర ప్రాంగణాలూ కళా సా హితీ కార్యక్రమాలకు వేదికలుగా ఉన్నాయి. నిరంతరం 4 వేదిక లపైసినీ గీతాలాపనలు, మహనీయుల జయంతులు, గ్రంథావిష్కరణల తో కళ కళ లాడే గానసభ, భారీ బడ్జెట్ కార్యక్ర మాలతోపాటు యువతను ప్రోత్సహించేలా సాంస్కతిక శాఖ నిర్వహణలో లఘు చిత్ర ప్రసా రాలు వంటి వాటితో అలరారే రవీంద్రభారతి దా దాపు 10 నెలలుగా స్తబ్దత నెలకొంది. వివిధ రం గాల కళా ప్రక్రియల కళాకారులు ఉపాధి కోల్పో యారు. ఒక్కొక్క కళాకారుడుది ఒక్కోకథ కాగా సంస్థల నిర్వాకులది మరో కథ. వారికీ సౌజన్య దాతలు దొరకలేదు. సన్మానం, సత్కారం, అవా ర్డ్లు తీసుకొనేందుకు ఎవరూ గతంలో లాగా ముందుకు రాలేదు. ఈ పరిస్థితులను అధిగమిం చామని భావించి ఈ సంవత్సరం మరల ఫిబ్ర వరిలో చిన్నగా.. భయం భయంగా కళా సంస్థ లు తమ క్యాక్రమాలను ప్రారంభించగా మార్చి మధ్య కాలం నుంచి ఏప్రిల్ మాసంతానికి వచ్చే సరికి కార్యక్రమాలు నగరంలో వివిధ వేదికలపై ఊపందుకున్నాయి. కొంచెం కొచెంగా ఊపిరి పోసుకొంటున్న తరుణంలో గతవారం రోజులు గా కరోనా విజంభణ సాంస్కతిక సంస్టల కార్య కలాపాలకు బ్రేక్ వేసింది. కరోనా కట్టడి అయ్యే వరకూ రవీంద్ర భారతిని లోక్డౌన్ చేస్తున్నట్లు సాంస్కతిక శాఖ ప్రకటించింది. ఇదే బాటలో ఇతర ఆడిటోరియంలు ప్రకటించినా ప్రకటించక పోయినా సంస్థలు మాత్రం కార్యక్రమాలు నిర్వ హణకు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేవు. ఒకవేళ వచ్చినా ప్రేక్షకులు ధైర్యం చేయరు. దీం తో కళా ప్రదర్శనలు ఆగిపోయి కళాకారులు విల విల లాడే పరిస్థితి ఏర్పడింది.