Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
లాలాపేట యూపీహెచ్సీ, దానికి ప్రక్కనే ఉన్న ప్రసూతి ఆస్పత్రి వద్ద కరోనా టెస్టులు, వ్యాక్సిన్ కోసం తెల్ల వారుజామున 5 గంటల నుంచే స్థానికులు బారులు తీరు తున్నారు. స్థానికులే కాకుండా చుట్టూ పక్కల ప్రాంతాల్లోని ప్రజలు కూడా రావడంతో కరోనా టెస్టింగ్ కిట్స్ సరిపడా లేకపోవడంతో కొంత మందికే చేస్తుండగా, మిగతావారు ఎండలో నిలబడి నిరాశతో వెనుదిరుగుతుండగా.. మరికొ ందరు స్థానిక సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో సిబ్బంది కూడా ప్రజలకు సరైన సమాధానం చెప్ప లేకపోతున్నారు. ఇక వ్యాక్సిన్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కానీ ప్రజలు మాత్రం డబుల్ సంఖ్యలో వస్తు న్నారు. వృద్ధులు క్యూలో నిలబడ లేక ఇబ్బందులు ఎదుర్కొ ంటున్నారు. మరోవైపు టెస్టింగ్ చేసే సిబ్బందికి కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదనీ, స్టాఫ్ కూడా సరిపడ లేక వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వివిధ అధి కారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల సిఫార్సు ఉంటే వెంటనే టెస్టులు చేస్తున్నారనీ, వ్యాక్సిన్ ఇస్తున్నారని పలు వురు పలువురు వాపోతున్నారు. గంటల కొద్దీ క్యూలో ఉన్న వారికి ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. అలాగే మెట్టుగూడ, అడ్డగుట్టలో ఉన్న యూప ీహెచ్సీ ఆస్పత్రుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించిన వెంటనే ప్రభుత్వాస్పత్రులకు సరిపడా టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట
డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి
ఇక్కడ ఆస్పత్రిలో సరిపడా టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ వచ్చేలా కృషి చేస్తాం. అందరూ వైద్య నిపుణులకు సహకరి ంచాలి. ప్రజలు మాస్కులు ధరించాలి. భౌతికదూర పాటించాలి.