Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పాడైపోయిన బోర్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజల కనీస అవసరాలను తీర్చాలని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ. ఉమామహేష్ అన్నారు. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ఐడీపీఎల్‌లోని జలమండలి కార్యాలయంలో జనరల్ మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూంనగర్లో బోర్లు పాడై రెండు నెలలు కావస్తున్నా మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలనీ, లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రతి రోజూ నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. దీంతో స్పందించిన అధి కారులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చినట్టు తెలి పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, మహి ళా సమాఖ్య అధ్యక్షురాలు పర్వీనా సుల్తానా, సీపీఐ కార్యవర్గ సభ్యులు నర్స య్య, వెంకట్‌రెడ్డి, నాయకులు యాకుబ్, ఇమామ్, యాదన్న, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.