Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేష్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మే డే స్ఫూర్తితో హక్కుల సాధనకు కార్మికులు ఉద్యమిం చాలని అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏఐసీటీ యూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర రాజేశ్ అన్నారు. ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాబోయే 135వ మేడేకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు, మార్క్స్, ఎంగెల్స్ సోషలిస్టు రాజ్యస్థాపన కోసం ప్రపంచ కార్మికులారా ఏకం కండని నినదించారని గుర్తుచేశారు.
అప్పట్లో రోజుకు 14 నుంచి 18 గంటలు పని చేయిస్తూ యాజమాన్యాలు తమ లాభాల కోసం కార్మిక శక్తిని దోచుకునేవన్నారు. దీనికి విసిగివేసారిన చికాగో నగర కార్మికులు 8 గంటల పని దినాలు కావాలని 1886 మే 1న సమ్మె చేశారని తెలిపారు. నాడు వారిపై సాయుధ బలగాలు కాల్పులు జరిపినా గుండెలు ఎదురొడ్డి పోరాడారని, వారి త్యాగ ఫలితంగా 8 గంటల పని విధానంతోపాటు మేడే ఆవిర్భవించిందన్నారు. ఆ స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యంగా హక్కుల సాధనకోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఏఐసీటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్.రాంచందర్, కార్యదర్శి మారం రామస్వామి, ఐక్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఈ బాలయ్య, కార్యదర్శి వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి బాబురావు, బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ వి. శ్రీనివాస్, మిల్లర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీ రామ్‌రెడ్డి, కార్యదర్శి ఎల్లయ్య, సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బల్వంత్ రెడ్డి, మాలాద్రి, కే రాము పాల్గొన్నారు.