Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-రాంనగర్
కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రజలకు ఎంతో ఉపయోగమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. గురువారం హిమాయత్‌నగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద కార్పొరేటర్లు రవిచారి, రచన స్త్రీలతో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు సరిగా ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆడపిల్లల పెళ్లిళ్లు భారం అవుతున్నాయని, ఈ సమయంలో ప్రభుత్వం అందించే సహకారం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా నియమాలు పాటించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో లలిత, డిప్యూటీ తహసీల్దార్ ఫారూఖ్, టీిఆర్‌ఎస్ యువనాయకులు ముఠా జై సింహ, లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మెన్ పూర్తి ప్రభాకర్, నాయకులు సిరిగిరి కిరణ్, ముదిగొండ మురళి, కిషన్ రావు, వివేక్, కోటేశ్వరరావు, నాగభూషణం, ఎర్ర శేఖర్ ,ఇంద్ర సేనారెడ్డి, సాబీర్ కూరగాయల శ్రీనివాసులు పాల్గొన్నారు