Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ సౌత్ జిల్లా కార్యదర్శి పి.నాగేశ్వర్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రభుత్వం కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి పి.నాగేశ్వర్ అన్నారు. గురువారం మేడే ఉత్సవాలను పురస్కరించుకుని ఉస్మానియా ఆస్పత్రి ముందు ఆటో కార్మికులతో కలిసి ఆయన సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా సమయంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలకు రేషన్ సరుకులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రహీమ్, అంజద్, అజీజ్‌బాబా, శకీల్ తదితరులు పాల్గొన్నారు
సంఘటితంగా ఉద్యమించాలి : ఏఐటీయూసీ
అబ్దుల్లాపూర్‌మెట్ : కార్మికులు సంఘటితంగా ఉద్యమిస్తే హక్కులను సాధించుకోవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆందోజ్ రవీంద్రాచారి అన్నారు. బుధవారం పెద్ద అంబర్‌పేట మున్సిపల్, కుంట్లూర్ రావినారాయణ రెడ్డి కాలనీలో ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర్ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డితో కలిసి మేడే వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బతుకులు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ పేద ప్రజలను పట్టించుకోవడం లేదని, కార్మిక వ్యతిరేక విధానాలకు బీజేపీ అమలుచేస్తోందని అన్నారు. దీనిపై అన్ని కార్మిక సంఘాలు పోరాడాలన్నారు. ప్రస్తుతం కేంద్రం నిర్లక్ష్యం కారణంగా దేశంలో హెల్త్ ఎమెర్జెన్సీ చోటుచేసుకుందని, ప్రజలు కరోనా వైరస్‌కు విలవిలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ మేడే వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు ప్రసాద్, మండల కార్యదర్శివర్గ సభ్యులు కష్ణసాగర్, నారాయణ, నిరంజన్, మహేందర్, పుల్లయ్య, ప్రవీణ్, రవి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.