Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆన్లైన్ లోకాంట డేటింగ్ యాప్'ద్వారా విటులకు గాలం
- నిందితుడి అరెస్టు
- ముగ్గురు అమ్మాయిలను రక్షించిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/హయత్నగర్
నగరంలో ఉపాధి, ఉద్యోగా అవకాశాలను ఇప్పిస్తానంటూ వెస్టుబెంగాల్, మహారాష్ట్రాతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో నగరానికి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న నిందితుడిని రాచకొండ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ బృందంతోపాటు ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ల్యాప్టాప్, ట్యాబ్, మూడు సెల్ఫోన్లతో పాటు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ మహేష్భగవత్ తెలిపిన వివరాల మేరకు వెస్టుబెంగాల్కు చెందిన దేబ్జయోతి దాస్ ఎంఎస్సీ వరకు చదువుకున్నాడు.
ఉపాధి కోసమని కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చిన దాస్ నాగోల్లో నివాసముంటున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న దాస్ 'ఆన్లైన్లో కాంట డేటింగ్' పేరుతో యాప్ను తయారు చేశాడు. అంతే కాకుండా 'లైవ్ క్యామ్ సెక్స్ సర్విస్ ఈస్ అవలేబుల్' పేరు తో యాప్లను ఏర్పాటు చేశాడు. వెస్టుబెంగాల్ కు చెందిన కొల్కత్తా, మహారాష్ట్రాలోని ముం బాయితోపాటు ఇతర మెట్రోసిటీలకు చెందిన అమ్మాయిలకు నగరం లో మంచి ఉద్యోగాలిపిస్తామని నమ్మిస్తున్నాడు. ఉపాధి అవకాశాలిప్పిస్తామని చెప్పి హైదరాబాద్కు తీసుకుస్తున్న నిందితుడు వారిని బంధిస్తున్నాడు. వారి ఫోటోలు తీసి తాను చెప్పినట్టు వినకుంటే వాటిని సోషల్మీడియాలో పెడ్తానంటూ బెదిరించి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నాడు. వారి ఫోటోలను 'ఆన్లైన్లో కాంట డేటింగ్' యాప్ పెట్టి విటులను ఆకర్షిస్తున్నాడు. ఒకొక్క విటుని నుంచి రూ.2000 నుంచి రూ.15వేల వరకు వసూలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. ముగ్గురు అమ్మాయిలకు విముక్తి కల్పించారు.