Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ-అంబర్పేట
రోడ్డు కటింగ్ అనుమతులు త్వరగా తీసుకుని వెంటనే పైపులైన్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని జలమండలి అధికారులను ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ కోరారు. గురువారం గోల్నాకలోని ఎంఎల్ఎ క్యాంపు కార్యాల యంలో వాటర్ వర్క్స్, ఆర్అండ్డి శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలమండలి అధికారులు, ఆర్ అండ్ డి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు కటింగ్ అనుమతులను త్వరగా తీసుకుని పనులు పూర్తి చేయాలని అన్నారు. కాచిగూడ డివిజన్లోని నింబొలి అడ్డా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి 200 మీటర్ల వరకు వేయనున్న పైప్లైన్ పనులకు రోడ్డు కట్టింగ్ అనుమతు లతో పాటు సదానంద్ హోటల్ నుండి గోల్నాక మార్కెట్ వరకు 300 మీటర్ల మేర వేయనున్న ఆర్సీసీి పైప్లైన్ నిర్మాణ పనులు రోడ్డు కట్టింగ్ అనుమతులు లేకపోవడం వలన గత కొద్ది రోజులుగా పెండింగులో ఉన్నాయని అన్నారు. వెంటనే ఆర్అండ్డి శాఖ అనుమతులు ఇచ్చి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వాటర్ వర్క్స్ జీఎం మహేష్ కుమార్, డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ మహేందర్, ఏఈ శేఖర్, ఆర్అండ్డి ఈఈ ధర్మారెడ్డి, సిబ్బంది రంజిత్ తదితరులు పాల్గొన్నారు.