Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని నందనవనంలోని బస్త్తీి దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్, కొవిడ్ టెస్టింగ్‌లో చాలా జాప్యం జరుగుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడ వుండే ప్రజానీకం టెస్టింగ్‌ల కోసం వచ్చే బాధితులు కిట్లు సరిపడా లేకపోవడంతో రోగులు చాలా ఇబ్బందు లకు గురిఅవుతున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన రోగులు కూడా పూర్తి స్థాయిలో మాస్క్‌లు ధరించే పరిస్థితులలో లేమని కాలనీలో వుండే పేద ప్రజలు దీనంగా నవతెలంగాణతో తమ గోడు వెళ్ళబోసుకున్నారు. కాలనీ లో నామ మాత్రంగానే శానిటేషన్ పనులు చేపడుతు న్నారని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ కరోనా కష్టకాలంలో కూడా కార్పొరేటర్ బాణోత్ సుజాత నాయక్ తమని పట్టించుకోవడంలేదని కాలనీవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి రూపాంతరం చెందుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేయడం పట్ల కనీసం డివిజన్లో అవగాహన కల్పించే ప్రజాప్రతినిధులు కరువయ్యారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.