Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోర్డు పరిధిలోని మారేడుపల్లి బోర్డు పరిధిలోని, 4,5 వార్డులలోని నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను గురువారం నాడు సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు శ్రీగణేష్ కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నాయి బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ వారు సమావేశం కావాలన్నా వారికి సామాజిక భవనం లేదని దీంతో గత కొన్ని సంవత్సరాల నుండి వారు మారేడుపల్లిలోని పార్క్ వద్ద ఓ చెట్టుకింద సమావేశం అవుతున్నారు. ఇప్పటి వరకు నాయి బ్రాహ్మణ సంఘము భవనంకు సంబంధించిన స్థలం కూడా కేటాయించలేదని భవన నిర్మాణం కలవాల్సిన స్థలం కేటాయించాలని వారు శ్రీగణేష్కు విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించి ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే సాయన్న, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరుల దష్టికి తీసుకెళ్లి వారికి భవనము నిర్మించుటకు కావలసిన స్థలం కేటాయించే విధంగా కషి చేస్తానని, అలాగే ఆ భవన నిర్మాణంను ప్రారంభించుటకు కావలసిన డబ్బు తానే స్వయంగా తన సొంత డబ్బు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. అనంతరం నాయి బ్రాహ్మణులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘము ప్రతినిధులు, సభ్యులకు శానిటైజర్, మాస్క్, హ్యాండ్ గ్లోజులను శ్రీగణేష్ ఫౌండేషన్ చైర్మన్, శ్రీగణేష్ మరియు పెద్దల నరసింహ (ఉద్యమకారుడు) అందజేశారు. ఈ కార్యక్రమంలో మారేడుపల్లి నాయి బ్రాహ్మణ సంఘము ప్రెసిడెంట్ హనుమంత్, శివశంకర్, ఎల్లయ్య, నారాయణ, తిరుమలేష్, మల్లేష్, విక్కీ, సాయి తదితరులు పాల్గొన్నారు.