Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూలోనే కరోన వ్యాక్సిన్స్ ఇవ్వాలి, కోవిడ్ టెస్ట్స్ నిర్వహించాలి
- కొవిడ్‌తో మతి చెందిన పలువురు, లక్షలు వెచ్చించి ప్రాణాలు కాపాడుకున్న మరికొందరు
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో కొవిడ్ విజంభిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా అదే స్థాయిలో కరోన అటు అధ్యాపకుల్లో, ఇటు ఉద్యోగుల్లో భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇటీవల ఓయూ సీఎఫ్ఆర్డి డెరైక్టర్, మాజీ నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహిమాన్ కోవిడ్‌తో గాంధీó ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మతి చెందారు. వీరే కాకుండా పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు, కాంట్రాక్టు,టైమ్ స్కేల్ ఉద్యోగులు, అధ్యాపకులు కొవిడ్ బారిన పడి మతి చెందారు. కొందరు మాత్రం వివిధ ప్రయివేట్ కార్పొరేట్ ఆస్పత్రులలో లక్షలు వెచ్చించి ప్రాణాలు రక్షించుకున్నారు. కొందరు స్వల్పకాలిక కరోన లక్షణా లతో హోం క్వారెంటైన్లో ఉండి తమకున్ను వివిధ డాక్టర్స్, నిపుణుల వైద్య సూచనలు, సలహాలు, ఆన్లైన్ ద్వారా తీసుకుంటూ మహమ్మారి నుండి ఉపశమనం పొందుతున్నారు. ఇంత స్థాయిలో అధ్యాపకులు, ఉద్యోగులు కరోన బారిన పడుతున్నా కనీసం వర్సిటీ అధికారులు ఉద్యోగుల ప్రాణాల సంరక్షణకు వైద్య పరమైన చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇంతటి క్లిష్టమైన సమయంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన ''ఓయూ హెల్త్ సెంటర్'' ఉత్సవ విగ్రహంలా మారటం గమనార్హం. ఓయూ వైద్యశాలలోనే ఓయూ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు కరోన టెస్ట్స్ నిర్వహించాలని, ఇక్కడే కరోన వ్యాక్సిన్స్ ఇవ్వాలని ఓయూలో అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు, అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవరసం అయితే ఓయూలో వసతి గహాలు, శిక్షణ కేంద్రాలు ఉన్నందున హోం ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని,సెల్‌ఫోన్స్ ద్వారా సలహాలు, సూచనలు, టిప్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. తద్వారా వారికి భరోసా, మనో ధైర్యం ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓయూలో చిన్న చితక పదవుల కోసం, మరోవైపు వీసీ పదవులు కోసం సర్వస్వం పైరవీలు, సిఫార్స్‌లు చేస్తున్న ఓయూలో అధికారులు మరి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఓయూలో వ్యాక్సిన్ మరియు కోవిడ్ టెస్టింగ్స్ కోసం ప్రభుత్వపై ఎందుకు ఒత్తిడి తేవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్న ఉద్యోగులు, అధ్యాపకులు అవసరం అయితే వంద మంది ఉద్యోగులు ఉంటే అక్కడే టెస్ట్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం చెపుతున్నా దానిని వినియోగించుకొక పోవడం గమనార్హం. ఇటీివలే ఔట అధ్యాపకులకు వేసవి సెలవులు ఇచ్చి ఇంటి నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహిం చేందుకు వెసులుబాటు కల్పించాలని ఓయూ ఇన్చార్జి వీసీ, రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు. దానిపై నేటికి అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాకతీయ యూనివర్సిటీ మే 1 నుండి 31 వరకు వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకోవైవు నిత్యం ఈ సమయంలో కూడా వందలాది మంది ఔటర్స్, ఉదయం సాయంత్రం ఓయూ వాకింగ్ వస్తుండటంతో విధుల్లోకి వచ్చే ఉద్యోగులు కొంత భయబ్రాంతులకు గురవుతున్నారు.