Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రసూననగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, వార్డు కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగశేఖర్గౌడ్ లేని లోటు తీర్చలేనిదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూననగర్లో ఏర్పాటు చేసిన నాగశేఖర్గౌడ్ సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగశేఖర్గౌడ్ అకాల మరణం తనకు, పార్టీకి తీరని లోటన్నారు. నిత్యం ప్రజా సమస్యలు, అభివృద్ధి, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలపై చిత్త శుద్దితో పని చేసేవారన్నారు. అలాంటి మంచి వ్యక్తి లేని లోటు ఎన్నటికి తీర్చలేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మరింత శక్తిని, మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం సభ్యులు నాగేశ్వరరావు, పండరీ, రామచందర్, సత్యనారాయణ, సిద్దులు, సంగారెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.