Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అన్నోజిగూడలో నూతనంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు టీకా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ ఎస్టీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేస్తున్న వ్యాక్సినేషన్ కేంద్రం పనులను కమిషనర్ సురేష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనే సూచనలతో టీకాకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతి, మరుగు దొడ్లు, ఫర్నీచర్ తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ అక్రమ్ ఆలీ, స్థానిక నాయకుడు రారఘవేందర్ రెడ్డి, ఇంజినీరింగ్ విభాగం అధికారి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.