Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతీ పౌరుడికి టీకా అందిస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడిన పౌరులకు వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియలో భాగంగా గురువారం పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనంగా నియోజకవర్గంలో కొంపల్లి, జగద్గిరిగుట్ట, ద్వారకనగర్, భగత్‌సింగ్‌నగర్, నందానగర్, సుభాష్‌నగర్‌లలో వ్యాక్సినేషన్ సెంటర్లను, కరోనా రోగులను తరలించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా టీకాపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు శానిటేజ్ చేసుకుంటూ సామాజిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ఆనంద్, కొంపల్లి కమిషనర్ రఘు, కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, బి.విజరుశేఖర్గౌడ్, మంత్రి సత్యనారాయణ, దుండిగల్, కొంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్లు టి.పద్మరావు, గంగయ్య , కౌన్సిలర్లు శంబీపూర్ కృష్ణ, భరత్, డివిజన్ అధ్యక్షులు మహమ్మద్‌రఫీ, సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.