Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు చలువాది ప్రవీణ్‌రావు కోరారు. ఈమేరకు గురువారం బీజేపీ ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఏనుగు నర్సింహ్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ సెంటర్ ఒక్కటే ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలు కరోనాబారిన పడకుండా కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కాలేరు రామోజీ, కప్పరగళ్ల కరుణాకర్, కోటగిరి ప్రబంజన్గౌడ్, రాచకట్ల శ్రీశైలం, సాల్వేరు రఘు, జోర్రిఈగల నాగేష్, చిలుక మహేందర్, వరదల రాకేష్, పాశం వెంకట్‌రెడ్డి, రాచకట్ల హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.