Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14.5 తులాల బంగారం, యూఎస్ డాలర్ల చోరీ
నవతెలంగాణ-హైదరాబాద్
ఇంటికి తాళాలు పగల గొట్టి 14.5 తులాల బంగారు ఆభరణాలు, కొంత అమెరికా డాలర్లు చోరీకి గురైన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేశవరెడ్డి నగర్‌కు చెందిన కోడిచెర్ల అరుణ్ కుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. గత నెల 24వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఈనెల2వ తేదీన రాత్రి ఇంటికి వచ్చారు. ఇంటి ప్రధాన ద్వారం తలుపు తాళం పగలగొట్టినట్లు కనిపించడంతో లోపలికి వెళ్లి బీరువా చూడగా అది కూడా తెరిచి ఉండటంతో అందులో ఉన్న దాదాపు రూ. 6లక్షల విలువైన బంగారు ఆభరణాలు, అమెరికా(యూఎస్) డాలర్లు చోరీకి గురయ్యాయి. వెంటనే మీర్ పేట్ పోలీసులకు సమాచారం అందించాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్ రెడ్డి, డీఐ సత్యనారాయణ తెలిపారు.