Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్ డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్
- నేడు ప్రారంభించనున్న మంత్రి సబితా
నవతెలంగాణ-బడంగ్పేట్
కరోనా మహమ్మారి నియంత్రణకు కోసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంగళవారం జల్పల్లి మున్సిపల్లోని పహడీ షరీఫ్‌లో 50పడకల కోవిడ్ సెంటర్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నట్లు కమిషనర్ డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈమేరకు సోమవారం పహడీ షరీఫ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ కేసులు, మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు జల్పల్లి మున్సిపాలిటీలో 50 పడకల ఆసుపత్రిని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్ని సదుపాయాలతో ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని తెలిపారు. మొదటి దశలో 50 పడకలతో ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే 150 పడకలకు పెంచుతామని పేర్కొన్నారు. వైద్యంతో పాటు మందులు, భోజనం ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ సదుపాయాన్ని స్థానికులు వినియోగించుకోవాలని కోరారు.