Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కరోనా మహమ్మారిపట్ల ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందని సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గ్లోబల్ పీస్ సంస్థ, గోషామహల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్ ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రివద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి, సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డిలు పాల్గొన్నారు. ఆస్పత్రి వైద్య సిబ్బందికి, రోగి సహాయకులకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. . ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో దినపత్రికలు చేస్తున్న కృషి అభినందనీయమని ఇన్స్పెక్టర్ సుబ్బరామి రెడ్డి పేర్కొన్నారు. గ్లోబల్ పీస్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ చిన్న బాబు మాట్లాడుతూ... పత్రిక స్వేచ్ఛ, పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ప్రజా సమస్యలను అక్షరరూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యల పరిష్కారంకోసం కలం యోధులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ దయానంద స్వామి, గ్లోబల్ పీస్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ చిన్న బాబు, సుల్తాన్ బజార్ ఎస్సై లింగారెడ్డి, సంఘ సేవకులు ఏ పాండు, గోషామహల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు డీఎస్ సుభాష్ కష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు గజ్జల వీరేశ్, ప్రధాన కార్యదర్శి వై. సతీష్, కోశాధికారి ఎం శ్రీధర్, సలహాదారులు పిజంగయ్య. ఎన్ రవి. ఎల్ విజరు కుమార్, చక్రవర్తి, సతీష్, గ్లోబల్ పీస్ సంస్థ ప్రతినిధులు వినరు శేషుబాబు, కమల్ ఏంజిల్ తదితరులు పాల్గొన్నారు.