Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను చేపట్టాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం పేట్‌బషీరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పేట్‌బషీరాబాద్‌లోని కోల్ నాలా సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జఠిలమైన కోల్ కాలువ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేయాలన్నారు. నాలా నిర్మాణ పనుల్లో స్థలాలు కోల్పోయిన వారిని గుర్తించి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కరోనా విపత్కర సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన దృష్టికి తీసుకవచ్చిన సమస్యలను వెంటనే ఒక ప్రణాళిక రూపొందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. తప్పని సరిగా మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈ ప్రాజెక్టు నారాయణ, ఏఈ నరేంద్ర, ఇంజినీరింగ్ ఈఈ కృష్ణ చైతన్య, ఇరిగేషన్ ఏఈ రామారావు, టౌన్ ప్లానింగ్ డీసీసీ సంతోష్‌కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.