Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
చెరువుల సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈ అశోక్ రెడ్డిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అల్మాస్ గూడాలోని కోమటికుంట చెరువును రూ. రెండు కోట్లతో, పోచమ్మ కుంటను కోటి రూపాయలతో, బాలాపూర్ లోని పెద్ద చెరువును కోటి రూపాయలతో అభివద్ధి చేయనున్నట్లు వివరించారు. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, ల్యాండ్ స్కేపింగ్ పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలు అహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువులను సుందరీకరించడంతో డ్రెయినేజీ నీరు కలవకుండా ఉండే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. కుర్మల్‌గూడ చెరువును కూడా అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు సంరెడ్డి వెంకట్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.