Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1,272 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి గెలుపు
నవతెలంగాణ -ఎల్బీనగర్
జీహెచ్ఎంసీ లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజ శేఖర్‌రెడ్డి విజయం సాధించారు. సోమవారం సరూర్ నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హౌమ్‌లో ఓట్ల లెక్కింపు జరిగింది. 15 రౌండ్లుగా అధికారులు ఓట్లను లెక్కింపు చేశారు. 1,272 ఓట్ల మెజార్టీతో దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఆకుల అఖిల్గౌడ్పై రాజశేఖర్‌రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డికి 7,240 ఓట్లురాగ, బీజేపీ అభ్యర్థి ఆకుల అఖిల్ గౌడ్‌కు 5, 968 ఓట్లు వచ్చాయి. పోస్టల్ ఓట్లు 38 పోల్ కాగా 33 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజ శేఖర్ రెడ్డికి లభించాయి. 5 ఓట్లు చెల్లలేదు. బీజేపీ అభ్యర్థికి పోస్టల్ ఓట్లు ఒక్కటి కూడా రాలేదు. లింగోజీగూడ డివిజన్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేయకుండా ఆకుల రమేష్‌గౌడ్ మతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆకుల రమేష్‌గౌడ్ కొడుకు అఖిల్‌గౌడ్ పోటీ చేయడంతో టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి గెలుపొందారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. లింగోజీ గూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్‌గా విజయం సాధించడంతో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌కు ముగ్గురు కార్పొరేటర్లు పెరిగారు. లింగోజీ గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ శేఖర్‌రెడ్డిని కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్‌గా కాంగ్రెస్ నియమించే అవకాశం ఉంది. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డికి దర్పల్లి సన్నిహితులుగా ఉన్నారు. లింగోజీ గూడ డివిజన్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి మల్ రెడ్డి రాం రెడ్డి కాంగ్రెస్ గెలుపుకోసం కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన లింగోజీ గూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజ శేఖర్‌రెడ్డి మాట్లాతూ... తన గెలుపుకోసం పని చేసిన ప్రతి కార్యకర్తకూ అభినందనలు తెలియజేశారు. ఈ విజయం లింగోజీ గూడ ప్రజలకే అంకితం అని, వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. అందరి సహకారంతో లింగోజీ గూడ డివిజన్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.