Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెంగాణకు 118.75 టన్ను ఆక్సిజన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ముందుకొచ్చి తన తోడ్పాటును అందిస్తోంది. వివిధ రాష్ట్రాలకు నిరంతరం లిక్వి డ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్ఎమ్ఓ) చేరవేసి ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు, భారతీ య రైల్వే దేశంలోని వివిధ రాష్ట్రాకు 76 ట్యాంక ర్లలో 1125 మెట్రిక్ టన్నుల (సుమారు) ఎల్ఎ మ్ఓను సరఫరా చేసింది. ఇప్పటికే 20 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్స్లు గమ్యస్థానాలకు చేరుకోగా, మరో 422 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో లోడయిన 27 ట్యాంకర్లు గల మరో 7 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్స్లు త్వరలో గమ్యస్థానాలకు చేరుకోనున్నాయ. తెం గాణకు ఒడిస్సాలోని అంగూల్ నుండి 118.75 టన్నుల ఎల్ఎమ్ఓతో రెండవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం చేరుకోనుంది. ఇదే తరహాలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానాకు సైతం మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మంగళ, బుధ వారంలోగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు చేరుకోనున్నాయి. ఇదిలా వుండగా హాపా (గుజ రాత్) నుండి 85 టన్నులతో బయలుదేరిన మరో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ త్వరలో గుర్గావ్కు చేరు కోనుంది. ఇప్పటివరకు భారతీయ రైల్వే మహా రాష్ట్ర 174 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చే యగా, ఉత్తర ప్రదేశ్ 430.51 మెట్రిక్ టన్నులు, మధ్య ప్రదేశ్ 156.96 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 190 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 109.71 మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది. ఇక తెంగాణ రాష్ట్రానికి 63.6 మెట్రిక్ టన్నులకుపైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను చేరవేసింది.
ఆక్సిజన్ కొరతరాకుండా ముందస్తు చర్యలు
రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు
ప్రాణావాయువు(ఆక్సిజన్) అవసరాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక న ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ కొరత లేకుండా చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వేగంగా ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు ఖాళీ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్ విమానంలో, రైల్వే ద్వారా ఒడిశాకు తరలిస్తూ అక్కడ ట్యాంకర్లు ఆక్సిజన్‌ను నింపుకుని తిరిగి హైదరాబాద్‌కు రోడ్డు మార్గాన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఎయిర్ ఫోర్స్ విమానంలో 50 మెట్రిక్ టన్నుల సామ ర్థ్యం కలిగిన 4 ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపించారు. దీనిని రవాణాశాఖ కమిషనర్ ఎం ఆర్ఎం రావుతో పాటు ఇతర అధికారులు దగ్గ రుండి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. కాగా ఆక్సి జన్ ట్యాంకర్ల రాకపోకలను అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు.