Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రోజూ భానుడి భగభగలతో ఉండే వేసవి వాతావర ణం సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్లో ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కబోతలు నుంచి ఉపశమనం కలిగించేలా వీచిన చల్లగాలులు ప్రజలను రిలాక్స్ అయ్యే లా చేశాయి. దక్షిణ మహారాష్ట్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరి తల ఆవర్తనం స్థిరంగా కొనసాగడంతో వాతావరణం ఒక్క సారిగా ఇలా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరు ములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఎంతకై నా మంచిదని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమ య్యారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వర కాలనీ డివిజన్ల పరిధిలో వరుణడి ఉధృతి కనిపించింది. ఈ దురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. కురిసింది 15 నిమిషాలే అయినా ఉరు ములు, మెరుపులు, ఈదురుగాలులు వీయడం వంటివి నగరాన్ని వణికించాయి. ఫిలింనగర్, హైటెక్ సిటీతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులకు కరెంట్ తీగలు చెదిరిపోవడంతో విద్యుత్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేప ట్టారు. మరో రెండురోజులపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.