Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రిలో కనీస అవసరాలను కల్పించలేక పోవడంతో పాటుగా సిబ్బ ంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి అన్నారు. మన్సూరాబాద్‌లోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేం ద్రానికి ఇక్కడి ప్రాంత ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుండటంతో ఇక్కడి వారికి కరోనా టెస్టులు, వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇబ్బందులు తలెత్తుతున్నా యని ఆయన అధికారులకు వివరించారు. ఈ హాస్పిటల్‌కు పంజాగుట్ట, పెద్ద అంబర్‌పేట, మల్కాజిగిరి, కర్మాన్‌ఘాట్, బార్కాస్ ఇలా అనేక ప్రాంతాల నుంచి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని మన్సురాబాద్ వస్తున్నారని తెలిపారు. స్థాని క డాక్టర్ పులివెందర్ నాయుడుతో మాట్లాడి ఆన్లైన్ వారి కి సగం వ్యాక్సిన్లు, చుట్టుపక్కల ప్రాంతాల వారికి సగం వ్యాక్సిన్లు వేయాలని కోరారు. లేకపోతే రేపటి నుండి ధర్నా కు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాతురి శ్రీధర్‌గౌడ్, పారంద సాయి, సిద్ధు పాల్గొన్నారు.