Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
శామీర్‌పేట సర్పంచ్ విలాసాగరం బాలామణి భర్త సత్యనారాయణ ఇటీవల మృతి చెందాడు. సోమవారం దశదిన కర్మ సందర్భంగా టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమె ంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి శామీర్‌పేటలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సత్య నారాయణ తనయులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు విలా సాగరం సుదర్శన్, విలాసాగరం అశోక్, కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, మజీద్ పూర్ సర్పంచ్ సరసం మోహన్‌రెడ్డి, వంగ వెంకట్‌రెడ్డి, దాసరి బాబు, మేడి భాస్కర్, వంగ నర్సింహరెడ్డి, గ్రామ అధ్యక్షులు శ్రీకాంత్‌గౌడ్, వార్డు సభ్యులు రాపోలు శ్రీను, ఉప్పలయ్య, నవీన్, ఉమ్మర్, సత్య నారాయణ, వజ్జల మురళీ, నిసార్ అహ్మద్‌ఖాన్, ఫారూఖ్, రవూఫ్, తదితరులు పాల్గొన్నారు.