Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మట్వాడ్ మజీద్ దగ్గర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు సోమవారం టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రంజాన్ పండుగకు ముస్లింలకు, బతకమ్మ పండుగకు హిందువులకు, క్రిస్మస్ పండుగకు క్రిస్టియన్లకు బట్టల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం చాలా గొప్పదన్నారు. దేశంలో ఏ ముఖ్యమం త్రికీ లేని ముందు చూపు ప్రజల పట్ల మన సీఎం ఉండ టం మన అదృష్టం అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఇంకా ముందుకు సాగుతోందనీ, ఇంకా అభివృద్ధి కావాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని అందరూ బలపరిచి వారికి అండగా నిలవాలని కోరారు. రంజాన్ శుభవేళలో ముస్లిం సోదరులందరూ కరనా నియంత్రణలు పాటిస్తూ రంజాన్ పండుగ జరుపుకోవాలని సూచించారు. ఈ సంద ర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలి పారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ చైర్మెన్ జక్కుల మహేశ్వర్రెడ్డి, వార్డు-3 బోర్డు మెంబెర్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్, ఇతర నాయకులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.