Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ 9వ డివిజన్లో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విద్యుత్ శాఖ ఏఈ తాజొద్దీన్‌కు డీడీని అందజేశారు. ఈ సందర్బంగా కార్పొరే టర్లు నిమ్మల సునితా శ్రీకాంత్‌గౌడ్, తోట శ్రీధర్‌రెడ్డి మాట్లా డుతూ బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని నాదరుగుల్ 8,9,27 డివిజన్లఓని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన రోడ్డు నుంచి టాటా ఏరోస్పేస్ వరకు అంటే బడంగ ్పేట కార్పొరేషన్ బార్డర్ వరకు స్ట్రీట్ లైట్స్‌కు సంబంధించి ఎలాక్ట్రిసన్ వైరింగ్ వేయడానికి కార్పొరేషన్ నుంచి రూ.3,75,216 డీడీని విద్యుత్‌శాఖ ఏఈ తాజుద్దీన్‌కు అందజేసినట్టు తెలిపారు. ప్రధాన రహదారిపై విద్యుత్ దీ పాలు లేకపోవటం వల్ల రాత్రి సమయంలో అందకారంగా ఉండటంతో ప్రమాదాలు, దొంగతనాలు జరుగుతున్నా యని వారు పేర్కొన్నారు. ఏఈ వెంటనే పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు.