Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, సచివాలయ నగర్ లో కరోనా వచ్చిందని కాలనీ సభ్యులు బీఎన్‌రెడ్డి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో తక్షణమే స్పం దించిన కార్పొరేటర్ వెంటనే కరోనాను అరికట్టడానికి సహాయ చర్యల్లో భాగంగా గుల్ఫర్ వాహనంతో హైపోక్లోరైడ్ ద్రవనాన్ని పిచుకారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు కరోనా విషయంలో ఎలాంటి అపోహలు వద్దనీ, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే భయాందోళనలకు గురి కాకుండా వెంటనే తనకు సమాచారం అందించాలనికోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ సంతోష్ కుమార్, ట్రెజరర్ అంజయ్యగౌడ్, జాయింట్ సెక్రెటరీ సురేందర్‌రెడ్డి, ఈసీ మెంబర్ కాంతారావు, డివిజన్ జనరల్ సెక్రెటరీ సంగమేశ్వర, ఓబీసీ మోర్చ అధ్యక్షులు వినోద్‌చారి, నాయకులు పిట్టా శ్రీనివాస్‌రెడ్డి, మధు ఎస్సీ సెల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.