Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు నాలుగో వార్డ్‌లోని కపా కాంప్లెక్స్‌లో ఉద్యమకారుడు బొడ్డు ప్రభాకర్ సోమవారం నాడు సోడి యం ద్రావణాన్ని, కెమికల్ ద్రావణాన్ని పిచికారి చేయిం చారు. కాంప్లెక్స్‌లోని ఏబిసిడి బ్లాక్‌లో ఇంటింటికీ వెళ్లి రసాయనిక ద్రవ్యాన్ని స్ప్రే చేశారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ గణేష్ ఏర్పాటుచేసిన స్ప్రే వాహనాన్ని ప్రభాకర్ ఇంటింటికీి శానిటేషన్ చేయించారు. కాగా బస్తీలో, కాలనీలలో ప్రజా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ ప్రతినిధులు వాహనాన్ని అడిగిన వెంటనే గణేష్ ఫౌండే షన్ ఉచితంగా ఇస్తున్నారు. అంతే కాకుండా స్వయంగా ఫౌండేషన్ ప్రతినిధులు వారి బస్తీలకు వచ్చి శానిటేషన్ చేస్తున్నారు. ఇప్పటికే గణేష్ ఫౌండేషన్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డుల్లో వాహనాలు నెలకొల్పి ప్రతిరోజు అనేక బస్తీలలో, కాలనీలలో మురికి వాడల్లో శానిటేషన్ చేస్తున్నారు. దీంతో స్థానికులకు కొంత ఊరట కలుగుతోంది. కంటోన్మెంట్లో రోజురోజుకీ కరోనా పెరుగుతుండటంతో కాలనీలో స్ప్రే చేసేందుకు అంతగా యంత్రాంగం కానీ వాహనాలు లేకపవడంతో ప్రజలు, స్థానికులు గణేష్ ఫౌండేషన్‌ను ఆశ్రయిస్తున్నారు.