Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని నెలలుగా గత గ్రామ పంచాయతీ జి+2 అనుమతులతో విచ్చలవిడిగా అనేక అక్రమ బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్న నేప థ్యంలో ఇప్పటివరకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టకపోవడం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ దాటవేత ధోరణి అవలంబిం చింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై రెండు నెలల క్రితం మున్సిపల్ నూతన చట్టం తీసుకు వచ్చి కొత్తగా స్పెషల్ టాస్క్ ఫోర్సు కమిటీ నియమించడం తో అట్టి కమిటీ ఎట్టకేలకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీ నేత త్వంలో సోమవారం ప్రగతినగర్లో 5 బహుళ అంతస్తుల నిర్మాణాలు, నిజాంపేట్లో 3, బాచుపల్లిలో 1, మొత్తంగా మొత్తంగా తొమ్మిది బహుళ అంతస్తుల నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణదారులు అనుమతి పొందిన ప్లాన్, అంతస్తులు నిబంధనల మేరకే నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన, ప్రతి అక్రమ నిర్మాణాలపై చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ టీం బాచుపల్లి ఆర్ఐ జగదీష్, బాచుపల్లి ఎస్ఐ సాయినాథ్, కూకట్పల్లి ఫైర్ ఆఫీసర్ కష్ణారెడ్డి, ఏ ఈ ధరణి రెడ్డి, సీపీబీ ఆర్.శ్రీనివాసరావు, నిజాంపేట్ కార్పొరేషన్ మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.