Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ భారత్ నగర్ రోడ్ నెంబర్ రెండు (2) లో డ్రెయినేజీ సమస్య తలెత్తడంతో కాలనీవాసులు కార్పొ రేటర్ బండారు శ్రీవాణి దష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆమె సంబంధిత అధికారులను సమస్య తొందరగా పరిష్కారం కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు అప్రమత్తమై ఉండి సమస్య పరిష్కారానికి కషి చేయాలని ఆమె ఆదేశించారు. దానిలో భాగంగా ఆ సమస్యను శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే పరిష్కరించారు. వారితోపాటు బీజేపీ నాయకులు డివిజన్ ప్రధాన కార్యదర్శి సంకూరి కుమారస్వామి, నిశాంత్, సురేష్ గౌడ్ పాల్గొన్నారు.