Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీ నగర్
లింగోజిగూడ డివిజన్లో బీజేపీ ఓటమికి ఆ పార్టీ అనుస రించిన విధానాలే కారణమని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆకుల రమేష్‌గౌడ్ మతితో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి రమేష్ గౌడ్ కుమారుడు అఖిల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుంచి దర్పల్లి రాజశేఖర్ రెడ్డిలు ప్రధానంగా పోటీపడ్డారు. టీిఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయంతో లింగోజిగూడలో ఆ పార్టీ పోటీ చేయలేదు. బీజేపీ అభ్యర్థికి మద్దతు పలుకుతూ టీఆర్ ఎస్ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీి, ఇక్కడ విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీని వరించింది. బీజేపీి కేవలం సానుభూతి ఓట్లను మాత్రమే నమ్ముకొని ప్రచారం నిర్వహించగా, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గతంలో తనకున్న పరిచయాలను అన్నింటినీ క్రోడీకరించి ప్రచారం చేశారు. లింగోజీగూడ డివిజన్ అభివద్ధి తనతోనే సాధ్యపడుతుంది అని ఎన్నికల్లో ప్రచారం చేసాడు. ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్ళారు. బీజేపీి దూరం చేసుకున్న అవకాశాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుని విజయానికి చేరుకుంది. బీజేపీకి మద్దతు పలుకుతూ టీిఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ స్థానిక బీజేపీి నాయకత్వం మాత్రం డివిజన్లోని టీఆర్ఎస్ శ్రేణులను తమతోపాటు కలుపు కొనిపోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. కనీసం టీఆర్ఎస్ మద్దతు కోరుతున్నట్లు ప్రకటనలు కూడా చేయలేదు. అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ అభ్యర్థి, దర్పల్లి రాజ శేఖర్ రెడ్డి తనకున్న పరిచయాలను సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం సానుభూతి ఓట్లతోనే గట్టెక్కుతామని భావించిన బీజేపీి చివరకు ఓటమి పాలైంది. బీజేపీ కార్పొరేటర్లు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేశారు. చివరికి ఫలితం దక్కలేదు. బీజేపీ నాయకులు ప్రగతి భవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలవడం రాష్ట్ర బీజేపీలో దుమారం లేపింది. బీజేపీ నాయకులు సాగర్ ఎన్నికకు ముందు రోజు వెళ్లడం పట్ల రాష్ట్ర అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. లింగోజీగూడ డివిజన్ ఎన్నికలు బీజేపీలో రెండు వర్గాల మధ్య మనస్పర్థలకు దారి తీసినాయి. చివరికి టీఆర్ఎస్ పోటీ చేయకపోయినా బీజేపీ గెలుపు అందుకోలేక పోయింది. పోలింగ్ 27 శాతం అయింది. మొత్తం ఓట్లు 13629 పోల్ అయినాయి. అందులో కాంగ్రెస్‌కు 7240 ఓట్లు వస్తే, బీజేపీకి 5968 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి 1272 ఓట్ల మెజార్టీతో విజయం సాధిచారు.