Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోఠి డీహెచ్ ఆఫీస్ ఎదుట ఆందోళన
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
టీఎస్పీఎస్సీ ప్రకటించిన స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల ఎంపిక జాబితాలో అక్రమాలు జరిగాయని, అభ్యర్థులు కోఠి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) ఆఫీస్ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... టీఎస్పీఎస్సీ ఇటీవల ప్రకటించిన నర్స్, స్టాఫ్ నర్సుల జాబితాలో 2, 418 మంది నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు, జాబితాలో మిగతా 893 పోస్టులకు అర్హత గల అభ్యర్థులు లేరని పేర్కొనడం దుర్మార్గమన్నారు. తమను కూడా ఎంపిక చేసి నర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగినా కూడా తమను ఎంపిక చేయపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. తమను ఎంపిక చేయకుంటే న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు