Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
- ఉద్యోగులకు మాస్కులు శానిటైజర్లు అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొవిడ్ సంక్షోభ సమయంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోవాలని హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అధికారులకు, సిబ్బందికి రెడ్ క్రాస్ చైర్మెన్ మామిడి భీంరెడ్డితో కలిసి ఆయన శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు అందజేశారు. కరోనా సంక్షోభ సమయంలో సేవలు అందిస్తున్న అందరినీ ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. నగర పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందికి, ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవఖానాలు, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అందిస్తామని జిల్లా చైర్మెన్ భీంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంసీ సభ్యులు రియాజుద్దీన్, జిల్లా జేఆర్సీ, యూఆర్సీ కన్వీనర్ మధుబాబు, చికిలి, గోల్కొండ మండల కన్వీనర్ సలావుద్దీన్, కలెక్టర్ కార్యాలయ ఏవో అయ్యప్ప, డీపీఆర్వో, సిబ్బంది పాల్గొన్నారు.