Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
మల్లాపూర్ డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సంబంధిత చెక్కులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డిలు జి.లతకు రూ.30వేలు, బీ.మహేష్‌కు రూ.20వేలు, జె.హేమలతకు రూ.36 వేలు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు మాట్లాడుతూ అత్యవసర ఆరోగ్య సమస్యలున్న వారికి అపన్న హస్తంగా సీఎంఆర్ఎఫ్ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఒకవైపు ఆరోగ్యశ్రీ పథకం కింద అనేక మంది లబ్ధిపొందుతున్నా, మరోవైపు సీఎంఆర్ఎఫ్ ద్వారా సీఎం కేసిఆర్ నిరుపేదలకు వైద్య ఖర్చులను అందిస్తున్నారన్నారు. దీని ద్వారా అనేకమంది బాగుపడుతున్నారు. సీఎంఆర్ఎఫ్ బాధితులకు భరోసా కలిగిస్తున్నది అని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నాయకులు శ్రవణ్ రెడ్డి, గరిక సుధాకర్, కష్ణ తదితరులు పాల్గొన్నారు.