Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ హమాలీలకు బుధవారం నాడు చైర్మన్ శ్రీనివాస్ పాసులు అంద జేశారు. అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే హమాలీలు, అకౌంటెంట్ గుమస్తాలు, కమీషన్ ఏజెంట్లకు లాక్ డౌన్ పాసులు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లా డుతూ రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్నప్పటికీ బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ నుండి కూరగాయల విక్రయాలు జరుగుతుంటాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారని, అలాగే దూరప్రాంతాల నుంచి రైతులు ట్రాలీ డ్రైవర్లు కూడా వస్తూ ఉంటారని అన్నారు. ఇందుకు మార్కెట్కు సంబంధించిన సిబ్బంది విధులకు హాజరు అయితేనే మార్కెట్లో లావాదేవీలు నడుస్తాయని చెప్పారు. అందుచేత సిబ్బందికి అత్య వసర పరిస్థితిలో పనిచేసేవారికి పాసులను ఇవ్వటం జరిగిందని వివరించారు.