Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రిలో ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్ర హానికి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ పూల మాల వేశారు. నర్సింగ్ గ్రేడ్ వన్ సూపరింటెండెంట్ సుజాత రాథోడ్, శిరీష. జె.సీిత, కపవరం. రేణుక తదితరులు పాల్గొన్నారు
ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో..
బంజారాహిల్స్ : ఏప్రిల్ 12 ప్రపంచ నర్సుల దినోత్సవ సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్‌పేటలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నైటింగేల్ చిత్ర పటానికి పుష్పాం జలి ఘటించారు. అనంతరం కోవిడ్ మహమ్మారి కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కోవిడ్ రోగులతో పాటు ఇతర సమస్యలతో హాస్పిటల్‌కు వచ్చే రోగులకు ఎన్నో సవాళ్ల మధ్య సేవలు అందిస్తున్న నర్సింగ్ సిబ్బందిని అభినందించారు. నర్సింగ్ సిబ్బంది చేస్తున్న ప్రత్యేక కషికి గుర్తింపుగా లిజో ధామస్, నర్సింగ్ విభాగపు అధిపతి, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారు ప్రత్యేకమైన బహుమతులు, ప్రశంశా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా లిజో ధామస్ మాట్లాడుతూ ప్రస్థుత మహమ్మారి పరిస్థితులలో నర్సులు నిర్వహిస్తున్న పాత్ర అనిర్వచ నీయమని అన్నారు. ఎన్నో సవాళ్ల మధ్య నర్సులు సేవలు అందిస్తున్నారని, తద్వారా ఎందరో ప్రాణాలు కాపాడగలుగుతున్నారని అన్నారు. కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా నర్సులు పూర్తిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నర్సులు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆస్టర్ ప్రైమ్ ఎన్నో చర్యలు చేపడుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో లిజో ధామస్, హెడ్, నర్సింగ్ డిపార్ట్మెంట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అశ్విన్ కుమార్ కాజా, హెచ్.ఆర్ విభాగాధిపతి, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్‌తో పాటూ నర్సింగ్ ఇతర మెడికల్, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
శామీర్‌పేట : మే 12న నర్సుల దినోత్సవం సందర్భంగా బుధవారం శామీర్‌పేటలో కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఆధ్వర్యములో నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ నర్సుల సేవ విలువ కట్టలేనిదని, కరోనా విజంభిస్తున్న సమయంలో ఆ సేవలు మరింత విలువ సంతరించుకున్నాయని అన్నారు. నర్సు దినోత్సవం నేపథ్యంలో తన జీవితాన్ని ప్రజల కోసం ధార పోసిన మధర్ థెరిసా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆమె ఆదర్శాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు దూడల శ్రీకాంత్ గౌడ్, కేసీఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, వసీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
నర్సులకు కిట్లు అందజేత
కంటోన్మెంట్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం నాడు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నర్సులను సన్మానిం చారు. మాస్కులు, కిట్లను అందజేశారు. బొల్లారం జనరల్ ఆస్పత్రిలో నర్సులను అలాగే బోయిన్పల్లి రెడ్ క్రాస్ ఆస్పత్రిలోని నర్సులకు మాస్కులు కిట్లను అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ నర్సులు చేస్తున్న సేవలు గణనీయ మైనవి అని అభినందించారు. నర్సులు ఎల్లవేళలా ఆరోగ్యాలతో ఉండాలని అందరూ భగవంతుని వేడుకోవాలి అని అన్నారు.
రామలక్ష్మికి ఘన సన్మానం
సుల్తాన్‌బజార్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పీిహెచ్ఎన్ రామలక్ష్మిని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందన శైలేందర్ యాదవ్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, వెంకటమ్మ, అలేఖ్య సుధారాణి, మాధవి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.