Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
లాక్ డౌన్ సమయంలో జర్నలిస్టులకు ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందిస్తూ కూకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కష్ణారావు ముందుకువచ్చారు. నియోజక వర్గ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా విలేకరులతో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మాట్లాడుతూ, ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా వారి సమస్యలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేసి అందరినీ ఆదుకునే పాత్రికేయులకు ఏ ఆపద రాకూడదని, ఈ కష్టకాలంలో నియోజకవర్గ పరిధిలోని విలేకరులకు అన్ని విధాలుగా తన వంతు సాయమందిస్తానని, వైద్యపరంగా జర్నలిస్టులకు వారి కుటుంబసభ్యులకు ఎలాంటి ఆపద ఉన్నా, నేరుగా తనకే ఫోన్ చేసి వారి సమస్య ను తనతో తెలియజేస్తే చాలు మీకు అండగా ఉంటానని కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తెలిజేశారు. అంతే కాకుండా అధికారులతో మాట్లాడి వాక్సిన్ టీకాలు పాత్రికే యులందరికీి ఇప్పించే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు.