Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సీపీలు
- సిటీలో మొత్తం 168 చెక్‌పోస్టులు ఏర్పాటు
- భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిత్యం రద్దీగా కనిపించే గ్రేటర్ రోడ్లు బుధవారం లాక్ డౌన్‌తో నిర్మానుష్యంగా మారాయి. ఈ మేరకు హైదరాబాద్, రాచ కొండ, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భద్ర తను కట్టుదిట్టం చేశారు. అడుగడుగునా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. సిటీలో మొత్తం 168 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటలు సడలింపు ఇవ్వడంతో మార్కెట్లల్లో రద్దీ కనిపించింది. నిత్యావసరాల కోసం జనం క్యూ కట్టారు. కాగా కొంత మంది వాహనదారులు మాత్రం రోడ్లుపై తిరుగుతూ కనిపించడంతో అప్రమత్తమైన హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల సీపీలు అంజనీకుమార్, మహేష్‌భగవత్, సజ్జన్నార్ రోడ్లపైకి చేరుకుని స్వయంగా తనిఖీలు నిర్వహించారు. వాహ నాలపై వచ్చిన వారిని ఎందుకొచ్చారని ప్రశ్నించిన అనంతరం వారి పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
పలు ప్రాంతాలను సందర్శించిన సీపీ
సీపీ అంజనీకుమార్ నగరంలోని పాతబస్తీతోపాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ పరిస్థితిపై స్వయంగా అడిగి తెలుసుకు న్నారు. వైద్య, ఆహార ఉత్పత్తుల సరఫరాదారులతోపాటు అత్యవ సర సేవలకు మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. అనుమతుల్లే కుండా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తామనీ, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంపూర్ణ లాక్డౌన్
రాచకొండ పరిధిలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. ప్రజలు ఇండ్లలోనే ఉండాలనీ, వ్యాపార సమూదాయాలు 10 గం టలకే బంద్ వేయాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలి పారు. అనవసరంగా రోడ్లుపైకి రావద్దన్నారు. లాక్డౌన్ పరిస్థి తులను సీపీ స్వయంగా పరిశీలించారు. ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిల్లోని చెక్ పోస్ట్‌లను పరిశీలించిన సీపీ పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పోలీసు సిబ్బంది మూడు షిప్టులలో పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేళల్లో లాక్డౌన్ ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. వ్యాపార సముదాయాలు ఉదయం 10 గంటలకే మూసేయాల నీ, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం సడలింపు ఇచ్చిన 4 గంటల్లో రైతు బజార్, రేషన్ దుకాణాలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, షాపింగ్ మాల్స్‌కు గుంపులుగా వెళ్లకూడదని సూచించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే రాచకొండ కొవిడ్ కంట్రోల్ రూం నెంబర్ 9490617234కు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.