Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
తమిళనాడుకి చెందిన వ్యాపారస్తుడికి ఎల్బీనగర్లోని కామినేని వైద్యులు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ల, డైరెక్టర్, హెపటోబిలియరీ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ, కామినేని హాస్పిటల్ నేతృత్వం లోని కాలేయ మార్పిడిబందం అత్యంత క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను పూర్తి సంక్లిష్టమైన కాలేయ విఫల రోగికి బుధవారం చేసింది. రెండు నెలలుగా మృతి చెందిన వ్యక్తి కాలేయం కోసం రోగి రాధాకృష్ణన్ వేచి చూస్తున్నారు. ఈ కాలేయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవన్‌దాన్ కడ వర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ద్వారా సేకరించినట్టు తెలి పారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స పొందిన రాధాకృష్ణన్ ఇప్పుడు కోలుకోవడంతోపాటు తన రోజువారి కార్యక్రమాల ను చేసుకోగలుగుతున్నారని వైద్యులు స్పష్టం చేశారు. కాలే య గ్రహీత, తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గరలోని పొల్లాచికి చెందిన 45 ఏండ్ల వయసు గల వ్యాపారవేత్త రాధాకృష్ణన్ ఆయనకు ఊబకాయం, మధుమేహం, హైప ర్ టెన్షన్, పునరావృత ఎన్సెఫలోపతీ (మెదడుకు సంబంధి ంచిన వ్యాధి) సహా పలు సమస్యలున్నాయి. వీటితోపాటు గా ఆయనకు క్రానిక్ నాన్ ఆల్కహాలిక్ స్టీయిటోహెపటై టిస్ కూడా అభివృద్ధి చెందింది. ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యా టీ లివర్ వ్యాధి (ఎన్ఏఎఫ్ఎల్డీ) యొక్క ముదిరిన రూ పం. ఉదరం వాపు, తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా అతని కాలేయం పూర్తిగా విఫలమైంది. ''సాధారణ పరిస్థితుల్లో కూడా కాలేయ మార్పిడి అనేది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఇప్పుడు కొవిడ్ దీనికి మరింత క్లిష్టతను జోడించింది. కామి నేని వద్ద తాము తగినంత నైపుణ్యం, అత్యాధునిక సాంకేతి కతతో ఈ సందర్భానికి తగినట్టుగా వ్యవహరించడంతో పాటు అవసరమైన కోవిడ్-19 భద్రతా మార్గదర్శకాలను అనుసరిస్తున్నాం'' అని రాజశేఖర్ పెరుమాళ్ల అన్నారు. ''ఈ రోగి అతి తీవ్రమైన వ్యాధులతో అంతిమ దశలో మా దగ్గరకు వచ్చారనీ. ఈ కేసు మాకు అనేక సవాళ్లను విసి రింది. అయినప్పటికీ మా బృందం వాటిని ధీటుగా ఎదు ర్కొని అత్యుత్తమ ఫలితాలను సాధించింది'' అని ఆయన పేర్కొన్నారు. కుటుంబం నుంచి ఆయనకు తగినట్టుగా రక్తపు గ్రూప్ కలిగిన దాతలెవ్వరూ లేకపోవడంతో ఆయన ఫిబ్రవరిలో జీవన్‌దాన్ కడవర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కార్యక్ర మం కింద కడవర్ ఆర్గాన్ కోసం నమోదు చేసుకున్నారు. తనకు తగిన అవయవం కోసం ఆయన దాదాపు రెండు నెలలు ఎదురు చూశారు. ఆయన తన బ్లడ్‌గ్రూప్‌కు సరి పోయే కడవర్ కాలేయంను పొందడంతో పాటుగా ఈ నెల 5వ తేదీన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను చేయించు కున్నారు. ఈ కాలేయాన్ని 38 సంవత్సరాల వయసు గల మహిళ నుంచి సేకరించారు. ఆమె దీర్ఘకాలిక మూత్రపిం డాల వ్యాధి బారిన పడి మృతి చెందారు. శస్త్రచికిత్స అనంతరం రాధాకృష్ణన్‌కు కొద్దిపాటి మూత్రపిండాల లోప ంతో సహా పలు సమస్యలు ఎదురైనప్పటికీ స్పెషలిస్ట్‌లతో కూడిన బృందం ఆయన వేగంగా కోలుకుంటారనే భరోసా అందించింది. శస్త్ర చికిత్స జరిగిన వారం తర్వాత ఆయన ఆకలి సాధారణతకు రావడం ఆరంభమైంది. ఆయన తగి న మోతాదులో ద్రవాహారం తీసుకోవడంతోపాటు పూర్తిగా కోలుకోగలుతున్నారు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ల, డైరెక్టర్, హెపటోబిలియరీ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ బి.డాక్టర్ బిశ్వరూప్ పౌల్, లివర్ అనస్తీషియస్ట్ బి.డాక్టర్ సంతోష్, ఎం.నారాయంకర్, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్తో కూడిన నిష్ణాతులైన బృందం చేసింది.