Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ కరోనా కట్టడిపై లేదని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షులు డాక్ట ర్ లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం సికింద్రాబాద్ మెట్రో పోలీస్ హోటల్లో తెరాపంత్ యువక్ పరిషత్ అధ్యర్య ంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా మొదటి వేవ్ సమయం లోనే రాష్ట్రానికి ఐదు ఆక్సిజన్ ప్లాంట్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరు చేసిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ప్లాంట్ నిర్మాణం చేశా రనీ, ఇలాంటి నిర్లక్ష వైఖరే ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితికి దారి తీసిందని విమర్శించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి దేశ వ్యాప్తంగా రైల్వే కోచ్ లలో 80 వేల కొవిడ్ బెడ్లు త యారు చేసి అందించారనీ, రాష్ట్రంలో రెండు వేల బెడ్లు అందుబాటులోకి తెస్తామని చెప్పినా ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదన్నారు. ఆక్సిజన్ కొరతను నివారించేందుకు మోడీ యుద్ధ విమానాలు ద్వారా ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నా రని తెలిపారు. డీఆర్డీవో ద్వారా ఢిల్లీలో 1000 బెడ్లతో అధునాతన మేక్ షిప్ కొవిడ్ ఆస్పత్రిని నిర్మాణం చేశారనీ, రాష్ట్రంలో కూడా అలాంటిదే ఏర్పాటు చేసేందుకు సంస ిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. పేదలకు రెండు నెలలపాటు కేంద్రం ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తుందని చె ప్పారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న విప త్కర పరిస్థితుల్లో తెరాపంత్ యువక్ పరిషత్ కరోన పేషే ంట్ లకు తక్కువ ధరకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా హ్యూ మన్ ఫౌండేషన్ ప్రతినిధులు పవన్ నహాట, ప్రకాష్ బంట ియాలు పేషేంట్ కిట్లను ఐసోలేషన్ సెంటర్‌కు అంది ంచారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జైన్ సమాజ్ అధ్య క్షులు అశోక్ బర్మీచ, తెరపంత్ యువక్ పరిషత్ అధ్యక్షులు రాహుల్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.