Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా అమీర్పేట లోని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా నైటింగల్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కొవిడ్ మహమ్మారి కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కొవిడ్ రోగులతో పా టు ఇతర సమస్యలతో హాస్పిటల్కు వచ్చే రోగులకు ఎన్నో సవాళ్ల మధ్య సేవలు అందిస్తున్న నర్సింగ్ సిబ్బందిని అభి నందించారు. నర్సింగ్ సిబ్బంది చేస్తున్న ప్రత్యేక కృషికి గుర్తి ంపుగా లిజో ధామస్, నర్సింగ్ విభాగపు అధిపతి, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారు ప్రత్యేకమైన బహుమతులు, ప్రశం శా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా లిజో ధామస్ మాట్లాడుతూ ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో నర్సులు నిర్వహిస్తున్న పాత్ర అనిర్వచనీయమన్నారు. ఎన్నో సవాళ్ల మధ్య నర్సులు సేవలు అందిస్తున్నారని తద్వారా ఎందరో ప్రాణాలు కాపాడగలుగుతున్నారని తెలిపారు. కొవిడ్ మహమ్మారి బారిన పడకుండా నర్సులు పూర్తిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నర్సులు చేస్తున్న సేవలకు గుర్తింపు ఆస్టర్ ప్రైమ్ ఎన్నో చర్యలు చేపడుతో ందని వివరించారు. ఈ కార్యక్రమంలో లిజో ధామస్, హెడ్, నర్సింగ్ డిపార్టుమెంట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అశ్విన్ కుమార్ కాజా, హెచ్ఆర్ విభాగాధిపతి, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్తోపాటు నర్సింగ్, ఇతర మెడికల్, పారా మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.