Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
వైరస్ ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని మల్కాజిగిరి డీసీపీ రక్షి తామూర్తి అన్నారు. బుధవారం నుంచి లాక్డౌన్ అమల వుతున్న నేపథ్యంలో నేరెడ్మెట్ పోలీసులు ఆర్కే పురంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించి పలు సూచన లు, సలహాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ పోలీస్ సిబ్బంది మూడు షిఫ్ట్లలో పని చేస్తున్నార నీ, నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ వేళలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. నిత్యావసర సరుకుల కోసం వెళ్లిన సమయంలో గుంపులు గుంపు లుగా తిరగకుండా భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలని కోరారు.