Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ తెలంగాణ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు గూడ ఐలయ్యగౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం జగద్గిరిగుట్టలోని మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా లాక్డౌన్ వేయడంతో లక్షలాది మంది ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పేద ముస్లింలకు ప్రభుత్వం రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలన్నారు.కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ యూసుఫ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సాజిత్, కాంగ్రెస్ నాయకులు శ్రవణ్‌కుమార్, కొండ మహేష్, ఎన్ఎస్యు విద్యార్థి నాయకులు వంశీ మధన్గౌడ్, జ్ఞాని, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.