Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కరోనా విపత్కర సయయంలో నగరంలోని మలక్‌పేటకు చెందిన హసీనా వెల్ఫేర్ ట్రస్టు పేద ప్రజలకు అండగా నిలుస్తూ చేయూతనందించడం అభినందనీయమని జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని మగ్దూంనగర్లో పేద ప్రజలకు పది రోజులు లాక్డౌన్ సందర్భంగా సుమారు 50 మందికి పైగా రేషన్ సరుకులు, దుస్తులు, మాస్కులు, శానిటైజర్ కిట్లను ట్రస్టు సభ్యులు డాక్టర్ సాజిదా, పి.సత్యనారాయణ, నవీన్, వ్యాపార వేత్త డి.వి.ఎన్.మూర్తిలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలోని పేద వారికి 10 రోజులకు సరిపడా సరుకులు ఇటువంటి ఆపధర్మ సమయంలో అందించడానికి ముందుకు వచ్చిన హసీనా వెల్ఫేర్ ట్రస్టు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్టు వ్యవస్థాపకులు అబ్దుల్ ఖాదర్, సభ్యులు డాక్టర్ సాజిదాలు మాట్లాడుతూ ట్రస్టు స్థాపించిన నాటి నుంచి అనేక రకాలుగా స్వచ్ఛంద సేవలతో పాటు పేదింటి ఆడపడుచులకు పెళ్లిళ్లు, వికలాంగులకు భోజన వసతి, చదువులో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు పాఠశాలలో, కళాశాలలో ఫీజులు కట్టడంతో పాటు ప్రతి నెల పేద వారికి రేషన్ సరుకులు అందించి నేటికి స్వచ్ఛందంగా కల్పించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం కరోనా లాక్డౌన్ సమయంలో కూడా సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రముఖ రేయాన్ ఐవీడీ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ డీవీఎస్ మూర్తి పాల్గొని శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్, నాయకులు విఘ్నేష్రారు, రేణుకయాదవ్ తదితరులు పాల్గొన్నారు.