Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి నిజాంపేట మిత్ర హిల్స్ వరకు సమాంతర రోడ్డులో రూ.1.85 కోట్లతో నిర్మిస్తున్న సైక్లింగ్ ట్రాక్, రూ.40 లక్షల వ్యయంతో చేపడుతున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వ్యాయామం చేసుకోవడానికి వీలుగా సుందరవనంగా తీర్చిదిద్ది ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ గోవర్ధన్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.