Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సీసీ కెమెరాల ఏర్పాటుకు సంక్షేమ సంఘం నాయకులు ముందుకు రావడం అభినందనీయమని గాజులారామారం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్నగర్లో యువ చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఒక్క సీసీ కెమెరాల వంద మంది పోలీసులతో సమానమన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నవాబు, వార్డు కమిటీ సభ్యులు సింగారం మల్లేష్, అసోసియేషన్ అధ్యక్షులు శివకుమార్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ఉపాధ్యక్షులు దూలప్ప, అసోసియేషన్ నాయకులు రాములు, శివారెడ్డి, అంజిరెడ్డి, నర్సింగ్ యాదవ్, కృష్ణ, నాగభూషణం, వెంకటేష్, రమేష్‌బాబు, అశోక్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.