Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట/మూడుచింతలపల్లి
లాక్ డౌన్ అమల్లో ఉన్న సందర్భంగా శామీర్ పేట, మూడు చింతల పల్లి మండలాల్లో శుక్రవారం ముస్లింలు రంజాన్ పండుగను తమ ఇండ్లలోనే నిరాడంబరంగా జరుపుకున్నారు. కాగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ సమస్త దేశ, రాష్ట్ర ప్రజల కు పండగ శుభాకాంక్షలు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ తమ ఇండ్లలోనే ప్రార్థనలు చేసి పండుగ చేసుకున్నారన్నారు. కరోనా మహమ్మారి అంతం కావాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మతపెద్దలు ప్రార్థనలు చేశారని ఆయన తెలిపారు.